విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది… ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా.. అక్కడక్కడ జరుగుతోన్న ఘటనలు కలవరపెడుతున్నాయి.. తాజాగా, కర్నూలు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. హాస్టల్ క్యాంపస్‌లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని నమస్తే పెట్టలేదని ఫైనల్ ఇయర్ విద్యార్థి దాడి చేశారని ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. అయితే, క్యాంపస్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేస్తున్నారు ట్రిపుల్ ఐఐటీ అధికారులు.. హాస్టల్ దగ్గర ఓ జూనియర్ విద్యార్థినికి, సీనియర్…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన…
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు. పదో…
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఈనెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో…
ప్రతి పార్లమెంమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చా అన్నారు సీఎం జగన్. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం. దరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చాం అన్నారు.
ఏపీలో విద్యార్ధులు పరీక్షలకు రెడీ అయ్యే టైం వచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది విద్యాశాఖ. పాత షెడ్యూళ్లను మార్చింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 6 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ.ఉదయం 9.30 గంటల…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత…
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్కు తరలించినట్లు…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది.…