Basara IIIT students are facing problems due to power cut: బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు తీరడంలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ట్రబుల్ ఐటీగా మారింది. ఎంత మందికి విద్యార్దులు వారి సమస్యలను చొప్పుకున్నా. సరా మామూలుగానే వుంటోంది. కలుషిత ఆహారం, సరైన సౌకర్యాలు లేవని అధికారులకు విన్నవించిన మాటలవరకే పరిమితం చేస్తున్నారు. ఎండ, వాన అని తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలు చేసిన పరిష్కార మార్గం కనిపించలేదు. మెస్ లో…
ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.…
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి…
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సర్వం సిద్దం చేశారు అధికారులు. కానీ.. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు అనుమతించరని తేల్చిచెప్పింది. అయితే.. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట సమయానికన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ పరీక్షలు ఈ నెల నేడు, రేపు, ఎల్లుండి (18, 19, 20) తేదీల్లో జరుగుతాయి. విద్యార్థులు మొత్తం 1,72,241…
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో నిన్న శుక్రవారం మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. read also: Nupur Sharma: ఫోటో…
మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తెలంగాణరాష్ట్రంలో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని మండిపడ్డారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. ఓ ప్రచార అర్భాంటంగా ‘మన ఊరు – మన బడి’ తయారైందని మండిపడ్డారు.…
ఏపీ సీఎం వైఎస్ జగన్.. రేపు (మంగళవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు.. ఆయా పాఠశాలల్లోని 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.. ఇక, కిట్ల…