తెలంగాణలో ఆర్టీసీ బస్ చార్జీలను అడ్డగోలుగాపెంపుదల పై టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతుంటే .. మెండిగా మోడీ ప్రభుత్వమే పెట్రోల్, డీజల్ రేటు తగ్గించిందని అన్నారు.
ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం మని మండి పడ్డారు. 60 ఏండ్ల చరిత్రలో ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు లేవన్నారు. సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వుందని ఎద్దేవ చేశారు. ఆర్టీసీ చార్జీలతో విద్యార్థులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఈ తీరుగా ఏ రాష్ట్రంలో చార్జీలను పెంచలేదని మండిపడ్డారు. తెలంగాణ లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆర్టీసీ బస్ చార్జీలపై మండిపడ్డారు.
ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. విద్యార్ధుల బస్సు పాస్‌లపై కూడా భారీ ఎత్తున పెంచారు.దేశంలో ఈ తీరుగా ఏ రాష్ట్రంలో చార్జీలను పెంచలేదు తెలంగాణ లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా pic.twitter.com/OeCMjo984G
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) June 11, 2022
బస్ పాస్ ఛార్జీలపై రేవంత్ రెడ్డి..
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం వారి పాలిట పిడుగుపాటని
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉంది. మోయలేని భారంతో విద్యార్థులను చదువులకు దూరం చేసేలా ఉందని. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం వారి పాలిట పిడుగుపాటు.
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉంది. మోయలేని భారంతో విద్యార్థులను చదువులకు దూరం చేసేలా ఉంది. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. pic.twitter.com/cub8hhEpwZ— Revanth Reddy (@revanth_anumula) June 11, 2022