విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది… ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా.. అక్కడక్కడ జరుగుతోన్న ఘటనలు కలవరపెడుతున్నాయి.. తాజాగా, కర్నూలు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. హాస్టల్ క్యాంపస్‌లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని నమస్తే పెట్టలేదని ఫైనల్ ఇయర్ విద్యార్థి దాడి చేశారని ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. అయితే, క్యాంపస్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేస్తున్నారు ట్రిపుల్ ఐఐటీ అధికారులు.. హాస్టల్ దగ్గర ఓ జూనియర్ విద్యార్థినికి, సీనియర్ విద్యార్థిని చేయి తగిలింది అంతే అంటున్నారు.. ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు ట్రిపుల్ ఐటీ అధికారులు.
Read Also: Rahul Gandhi : తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్..