కాకతీయ యూనివర్శిటీలో హాస్టల్స్ ని యథావిధిగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబిఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీసీ విద్యార్థి సంఘం, బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లైబ్రరీ నుండి వీ,సి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీసీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు కోచింగ్ తీసుకుంటూ లైబ్రరీ లో చదువుకుంటున్న క్రమంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులందరూ హాస్టల్స్ ని ఖాళీ చేసి బయటికి వెళ్ళాలని ఆదేశించడంపై మండిపడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్యార్ధి సంఘాల నాయకులు అన్నారు. యథావిధిగా హాస్టల్స్ మెస్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. న్యాక్ పేరు తో హాస్టల్స్ ని ఖాళీ చేయాలని యూనివర్సిటీ అధికారులు కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వేయక వేయక నోటిఫికేషన్ ని విడుదల చేస్తే విద్యార్థుల అందరూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో యూనివర్సిటీ అధికారులు హాస్టల్స్ ని ఖాళీ చేయాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు మంద నరేష్, చెల్పూరి శ్రీకాంత్, మచ్చ పవన్ కళ్యాణ్, దూడపాక శ్రీకృష్ణ, దార సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Minister KTR: లైఫ్ సెన్సెస్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్