ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం.
పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చాం అన్నారు జగన్.
10 లక్షల మందికి జగనన్న వసతి దీవెన కింద 2021 22 కి 1,024 కోట్లు తల్లుల ఖాతాలోకి వేస్తున్నాం. కోర్సును బట్టి 10 వేలు, 15, వేలు, 20 వేలు జగనన్న వసతి దీవెన కింద ఇస్తున్నాం. ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి ఇస్తాం. తల్లుల ఖాతాలోకి రెండు విడతలుగా ఇస్తాం. జగనన్న వున్నాడని మీరు భరోసాతో వుండండి. అన్నీ నేను చూసుకుంటాను.
https://ntvtelugu.com/ap-ministers-power-is-gone-rush-is-also-gone-at-their-houses/
కాలేజి యజామాన్యాలు వసతులు కల్పించలేదని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. విద్యారంగం రూపురేఖలు మారుస్తున్నాం…నాడు, నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నాం. గోరు ముద్ద కింద మంచి భోజనం ఇస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. విద్యార్థుల సౌకర్యార్థం బై లింగువల్ పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం అని చెప్పారు సీఎం జగన్. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం…నంద్యాలలోను మెడికల్ కాలేజి వస్తుంది.
కాలేజీల్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అమలు చేస్తున్నాం. 67 ఓకేషనల్ కోర్సులు, డిగ్రీ హానర్స్, మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు అమలు చేస్తున్నాం. 12వ తరగతి వరకు స్కూల్ కి పంపితే చాలు… అమ్మ ఒడి కింద డబ్బులు ఇస్తున్నాం. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ రుణాలు..ఇలా ఎన్నో అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. మూడేళ్ళుగా మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తున్నాం
పిల్లలకు స్కూల్లో చిక్కి ఇస్తున్నాం…గతంలో 500 కోట్లు ఖర్చు చేస్తే మేము 1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చిక్కి కి కవర్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు, ఎల్లో మీడియా జగనన్న ఫోటో వుందని రాస్తారు. కడుపు మంట, అసూయకు మందు లేదు. కడుపు మంట, అసూయ ఎక్కువైతే గుండె పోటు వచ్చి టికెట్ తీసుకుంటారు. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్ డబ్బులు కూడా మేమే చెల్లించాం అన్నారు జగన్. అన్న వున్నాడు అనే నమ్మకంతో ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు, దత్తపుత్రునికి, ఎల్లో మీడియా కి కనిపించవు. రోజుకో కట్టుకథ చెప్పి అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ వేదికను కూడా అందుకు వాడుకుంటున్నారు….రాష్ట్ర ప్రతిపక్షం ఈ దౌర్భాగ్య స్థితిలో ఉండడం దురదృష్టం అన్నారు జగన్.