విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బకాయి ఉన్న ఫీజులను చెల్లిస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూజివీడు , శ్రీకాకుళం , ఇడుపులపాయ , ఒంగోలు క్యాంపస్‌లలో ఫీజులు చెల్లించని 4వేల మంది ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను ఆర్జీయూకేటీ నిలిపివేసింది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినా ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేదు.
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు..
విద్యార్థులకు, వారి తల్లులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు సీఎం జగన్.. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
DSC notification: ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ… త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు.. సీఎం వై ఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్న ఆయన.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం.. త్వరలో బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. బదిలీలకు పరదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం.. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నారు. Read Also: PM Modi: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారింది..…
భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. దేశంలో అక్షరాస్యత పరంగా రెండవ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం.. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పిల్లలు ముందుకు సాగడానికి సాధ్యమైన అన్ని అవకాశాలను ఇస్తుందని హ్యాపియెస్ట్ స్టేట్ నివేదిక తెలిపింది.
CM YS Jagan: విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని స్పష్టం చేశారు.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. పిల్లలను బడికి…
Mass Copying: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు…