Students Missing: విశాఖలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం.. ఒకేసారి ముగ్గురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Missing: విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది.. గాజువాకలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు.. ఈ నెల 24వ తేదీన కే. కోటపాడు వెళ్లారు ముగ్గురు విద్యార్థులు.. కే.కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ.. తిరిగి ఇంటికి చేరుకోలేదు.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురికి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.. దీంతో.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. ఈ విషయానికి పోలీసులకు చేరవేశారు.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
Read Also: Bihar : విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్లు.. ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావమై..
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ఇక, గాజువాక పోలీసుల సమాచారం మేరకు కే.కోటపాడు పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.. అయినా ఇప్పటి వరకు విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు.. తప్పిపోయిన విద్యార్థులు ఉమేష్ పవన్ (16), పిల్లల దిలీప్ (16), దంతేశ్వరి (16)గా గుర్తించారు.. వీరు ముగ్గురూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యార్థులు కనిపించకుండా పోవడం వెనుక కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఉద్దేశ్యపూర్వకంగానే ముగ్గురూ కలిసి వెళ్లారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ మధ్యే విశాఖలో కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.. ఈ తరుణంలో ఆ ముగ్గురు విద్యార్థులు ఎటుపోయారు అనేది ఆస్తికరంగా మారిపోయింది.
తాజావార్తలు
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!