Rajasthan Kota:కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కోచింగ్ సెంటర్లలో ఉంటూ చదువుకోలేక.. తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ కోచింగ్ సెంటర్లు అంటే అక్కడ ఉంటున్నారని నిన్న రాజస్థాన్‌లో జరిగిన ఘటనే రుజువు చేస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరొక విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు కాపాడి వైద్య చికిత్సను అందించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Read also: Allu Arjun: అల్లు అర్జున్ ఎన్ని రకాల బిజినెస్ లను చేస్తున్నాడో తెలుసా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీట్, జేఈఈ కోసం ప్రత్యేకంగా కోచింగ్‌లను ఇస్తుంటారు. అలాగే రాజస్థాన్‌లోని కోటాలో కూడా ఇదేవిధంగా నీట్, ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం కోచింగ్‌ను నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా కోటాలో కోచింగ్‌ను కొనసాగిస్తున్నారు. కోటాను కోచింగ్ హబ్ అని పిలుస్తారు. కోచింగ్ సెంటర్లతోపాటు.. రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లలో వారు ఇచ్చే కోచింగ్‌ను తట్టుకోలేక.. మిగిలిన విద్యార్థులతో పోటీ పడలేక మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు మరొక కాలేజీకి చెందిన అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. బాసరలోని త్రిపుల్ ఐటీలో 10 రోజుల క్రితం ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా చదువుకునే వయసులో వారు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు రాజస్థాన్‌లోని కోటాలో గల కోచింగ్ సెంటర్లలో గత రెండు రోజుల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మరణించారు.
Read also: Kanaka Durga temple: దుర్గ గుడిలో మరో వివాదం.. వైరల్‌గా మారిన వీడియో
కోటాలో ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ హబ్‌కు విద్యార్ధులు వస్తుంటారు. రెండు రోజుల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు చదువుకుంటున్న సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. అతను రెండు నెలల క్రితం వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌లో కోచింగ్ తీసుకోవడం కోసం ఇక్కడకు వచ్చాడు. ఆత్మహత్యలకు పాల్పడిన అబ్బాయిలు విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని ప్రత్యేక నివాసాలలో నివసించారు. వీరిలో ఒకరు సోమవారం మరణించగా.. మరొకరు మంగళవారం శవమై కనిపించారు. బీహార్‌కు చెందిన మరో 17 ఏళ్ల బాలుడు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం శిక్షణ పొందడం కోసం 3 నెలల క్రితం కోటాకు వచ్చాడు. తాను చదవలేక పోతున్నానని తీవ్ర మానసిక వేదనతో ఉన్నానని తనను తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసకుంటానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన తల్లిదండ్రులు ప్రభుత్వ పిల్లల సంరక్షణ సేవలకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసుల సాయంతో విద్యార్థిని రక్షించ గలిగారు.
Read also
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మూడు నెలల క్రితం కోటకు వచ్చాడని ఇంటిపై బెంగ పెట్టుకొని ఆదివారం అతను తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని..దీంతో అప్రమత్తమైన అతని తండ్రి ప్రభుత్వ కౌన్సెలింగ్ సర్వీస్ అయిన చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వేగంగా వెళ్లి బాలుడిని రక్షించి.. రంగబడి ప్రాంతానికి తరలించారు. 20 నిమిషాల్లో యువకుడిని రక్షించి, మరుసటి రోజు కోటాకు వచ్చిన వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దక్షిణ రాజస్థాన్ నగరం కోటాలో ప్రముఖ కోచింగ్ సెంటర్‌లకు ప్రసిద్ధి చెందింది, ఇది అగ్రశ్రేణి సంస్థల్లో ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులలో ప్రవేశానికి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా, విద్యార్థులు ఒత్తిడి మరియు మానసిక నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నగరంలో జరుగుతున్నాయి. గత ఏడాది కోటాలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 14కు చేరిందని పోలీసులు ప్రకటించారు.