Home
Student Safety
Student Safety News
-
Odisha: ఇలా ఉన్నారేంట్రా..! నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ వేసిన క్లాస్మేట్స్..!
Odisha School Horror: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ పాఠశాలలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ విద్యార్థుల కళ్ళు మూసుకుపోయాయి. గమనించిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెబాశ్రమ్ పాఠశాల హాస్టల్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు. -
POCSO Case:17 ఏళ్ల విద్యార్థితో 40 ఏళ్ల మహిళా టీచర్ శారీరక సంబంధం.. కోర్టు కీలక వ్యాఖ్యలు..
విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన ముంబైలోని ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఉపాధ్యాయురాలికి బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత విద్యార్థి వయస్సు 17 ఏళ్లు పైబడి ఉందని ప్రత్యేక న్యాయమూర్తి సబీనా ఎ మాలిక్ తెలిపారు. -
Kolkata Gang Rape: కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం..
కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఇకపై ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ లా కాలేజీ క్యాంపస్‌లో జూన్ 25న మొదటి సంవత్సరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. -
Kolkata Gang Rape: కోల్‌కతా గ్యాంగ్‌రేప్ ఘటన.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు..!
సౌత్ కోల్‌కతా లా కాలేజీ అత్యాచారం కేసులో కోల్‌కతా పోలీసులు శనివారం ఓ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది నాల్గవ అరెస్టు. గతంలో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. -
Kolkata: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. విద్యార్థిని 7 గంటలకు కాలేజీకి ఎందుకు వచ్చింది..?
కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు… -
Hyderabad: చిన్నారుల ప్రాణాలతో చలగాటం.. తప్పితాగి పోలీసులకు పట్టుబడ్డ స్కూల్ బస్సు డ్రైవర్లు..
హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ పరీక్షల్లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు.. యూసఫ్ గూడ బస్తీలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.. అయితే..ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్వీన్స్, ప్రిజం స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రైవర్ కు 156 రీడింగ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకున్నారు. -
Snake : హనుమకొండ పాఠశాలలో టాయిలెట్‌లో కొండచిలువ కలకలం
Snake : హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్‌లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్‌లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్‌కు… -
Jagtial District: ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. -
Physical Harassment : ప్రభుత్వ ప్రధానోపాధ్యాయునిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
Physical Harassment : జగిత్యాల జిల్లా విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలో ఉన్న ఓ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతను విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని, కులాలను అడిగి అవమానిస్తూ టచ్ చేస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా విద్యాధికారి (డీఈవో) రాముకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు తమ సమస్యను వెల్లగక్కుతూ ప్రధానోపాధ్యాయుడు మానసికంగా… -
Sangareddy: గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్‌లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!