CMR College: హైదరాబాద్‌లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం…
CMR Engineering College: మేడ్చల్‌లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత…
Suicide : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భవాని నగర్ లో దారుణం చోటు చేసుకుంది.ఒమేగా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని నిన్న రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల నుండి వచ్చిన తర్వాత పూర్ణిమ ను నిఖిల్ అనే వ్యక్తి నుండి ప్రేమ పేరుతో వేధింపులు శృతి మించడంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పూర్ణిమను…
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.