కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఇకపై ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ లా కాలేజీ క్యాంపస్‌లో జూన్ 25న మొదటి సంవత్సరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) అనే ఇద్దరు విద్యార్థులతో పాటు, కళాశాల సిబ్బంది మోనోజిత్ మిశ్రా (31) ను అరెస్ట్ చేశారు. తాజాగా సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Hydra: ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే.. పార్కును కాపాడిన హైడ్రా
కాగా.. ఈ అంశంపై ఇప్పటికే బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘లైంగిక చర్య జరిపే ఉద్దేశంతో నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించారు. నేను నిరాకరిస్తూ.. దగ్గరికి రాకుండా ప్రతిఘటించి మోనోజిత్‌ని వెనక్కి నెట్టేశాను. ఏడుస్తూ వదిలిపెట్టాలని వేడుకున్నాను. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. అతడిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అంగీకరించలేదు. మోనోజిత్ కాళ్లు పట్టుకొని వదిలేయాలని ప్రాధాయపడినా.. వదల్లేదు. ఆ తర్వాత నన్ను సెక్యూరిటీ గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర భయాందోళనకు గురయ్యా. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరినా ఎవరూ సహాయం చేయలేదు. ప్రధాన నిందితుడు అత్యాచారం చేస్తుంటే మిగతా ఇద్దరూ వీడియోలను రికార్డు చేశారు. నేను సహకరించకపోతే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించిన క్రమంలో హాకీ స్టిక్‌తో దాడి చేశారు. నాకు న్యాయం చేయండి’’ అని బాధితురాలు పోలీసులను కోరారు.
READ MORE: Dil raju Dreams : దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ పై.. అనిల్ రావిపూడి షాకింగ్ రియాక్షన్!