హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ పరీక్షల్లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు.. యూసఫ్ గూడ బస్తీలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.. అయితే..ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్వీన్స్, ప్రిజం స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రైవర్ కు 156 రీడింగ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. అమీర్ పేట్‌లోనూ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.. శ్రీ చైతన్య స్కూల్ బస్సు డ్రైవర్ కేశవరెడ్డికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. 202మోతాదు వచ్చిందని పోలీసుల వెల్లడించారు. దీంతో శ్రీ చైతన్య స్కూల్ బస్సును సీజ్ చేశారు.
READ MORE: Suryakumar Yadav: హెర్నియా సమస్యతో బాధపడుతున్న కెప్టెన్.. సర్జరీ తప్పదా..?
లక్షలు పోసి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తే.. వారి భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలేశాయి. అసలు డ్రైవర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనే విషయాన్ని సైతం గమనించలేకపోతున్నారు. తప్పతాగి వస్తున్నా గుర్తించలేకపోతున్నారు. ఇది యాజమాన్యాల నిర్లక్ష్యానికి నాంది. డ్రైవర్లు కూడా స్కూల్ బస్సు కావడంతో తమను పోలీసులు ఆపరని, తనిఖీ చేయరని ఇలా తప్పతాగి వస్తున్నారు. ముందే సిటీలో వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరిగి పోతోంది. ఇంత మోతాదులో తాగి నడిపితే.. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటికైనా పాఠశాల నిర్వాహకులు కళ్లు తెరుచుకోవాలని.. ఫీజుల వసూళ్లు, అడ్మిషన్లపై దృష్టి పెట్టడం కాకుండా.. తమను నమ్మి స్కూల్‌లో చదువుతున్న చిన్నారుల భద్రతపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
READ MORE: Atharvaa: నాన్న మరణం.. చాలా భయానకం.. హీరో కీలక వ్యాఖ్యలు