సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్‌లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా.. హాస్టల్ నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ ను పోలీసులు పరిశీలించారు.
Read Also: Pendem Dorababu: జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారని మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టాడు. అనంతరం.. ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కెమెరా పెట్టాడు మహేశ్వరరావు. కాగా.. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది.
Read Also: TGPSC: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్