స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే.. వంటింట్లో ఉండే లవంగాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. లవంగాలను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉసిరికాయతో చేసిన ఉసిరి ఊరగాయ, రసం అంటే చాలా మందికి నచ్చుతాయి. ఉసిరి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. ఉసిరికాయ వినియోగం చర్మం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర, బరువును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది.
మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా…
ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.