చిన్నపిల్లలు చిన్నచిన్న నాణేలను తెలియకుండా మింగేస్తుంటారు. ఇక కొంతమంది బంగారం ఇతర వస్తువులను మింగేస్తుంటారు. అయితే, బీహార్ చెందిన ఓ వ్యక్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఏదో వస్తువు ఉందని గమనించిన వైద్యులు ఎండోక్కోపీ విధానం ద్వారా పరీక్షించగా, కడుపులో గ్లాసు ఉన్నట్టు గుర్తించారు. మలద్వారం ద్వారా బయటకు తీసుకురావాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశారు. అయితే ఆ వస్తువును ఎలా మింగాడు…
ప్రపంచంలో ఎక్కువమంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో దొరికే చేపలను పట్టుకొని జీవిస్తుంటారు. అయితే, ప్రతిరోజూ సముద్రంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు. ఒక్కోసారి అదృష్టం అలా కలిసి వస్తుంది. నిత్యం సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే ఓ మత్స్యకారుడి వలకు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేపను పడవలోని బల్లపై ఉంచి కత్తిలో కోశాడు. చేప కడుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండగా అతడికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు…