Telangana and Four other rich States: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా రిజిస్టరైన మొత్తం కార్లు మరియు SUVల్లో దాదాపు 38 శాతం తెలంగాణ సహా 5 సంపన్న రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 14 లక్షల కార్లు మరియు SUVలు రిజిస్టర్ కాగా అందులో 5 లక్షల 4 వేల వాహనాలు ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, గుజరాత్‌లలోనే నమోదయ్యాయి. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి 5…
ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని…
Samsung SmartPhones Sales: ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్‌లో మొదటి రోజే శామ్‌సంగ్‌కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్‌సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది.
Funds for Bhanzu: హైదరాబాద్‌కి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్‌గా లెక్కలు చేసే హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్ కరికులమ్‌లను ఇంకా డెవలప్ చేసేందుకు ఈ ఫండ్స్‌ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్ ది సెల్ఫ్’ సెల్ థెరపీ ట్రీట్మెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
Indane Gas Customers: ఇండేన్ గ్యాస్ బుకింగ్, డెలివరీ సేవల్లో రెండు రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలిగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు.
Demand For Heavy Vehicles: మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు ఈ ఏడాది 50 శాతం పెరిగే ఛాన్స్ ఉందని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ ఎండీ అండ్ సీఈఓ సత్యకం ఆర్య అన్నారు. ఈ వాహనాలకు గత కొద్ది నెలలుగా డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. జనవరి, ఆగస్టు మధ్య కాలంలో ట్రక్కులు, బస్సుల అమ్మకాల్లో వృద్ధి నెలకొందని పేర్కొన్నారు. అయితే 2018లో మాదిరిగా పీక్ లెవల్‌లో మాత్రం సేల్స్ జరగట్లేదని తెలిపారు.