Stock Market Today : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్‌కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్…
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.
Business Today: ఏపీలో బంగారం తవ్వకాల దిశగా..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాల దిశగా ఎప్పుడో విజయవంతంగా తొలి అడుగు వేసిన ఎన్‌ఎండీసీ.. ఇప్పుడు రెండో అడుగు కూడా ముందుకేసింది. మైనింగ్ లైసెన్స్ పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి తాజాగా తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లైసెన్స్ లభిస్తే నాలుగేళ్ల నిరీక్షణ ఫలించినట్లవుతుంది.
Business Today: హైదరాబాద్ సిగలో మరో అంతర్జాతీయ కేంద్రం: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కి మరో ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంఎన్‌సీ రోషె ఫార్మా తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పిలుస్తారు. షార్ట్ కట్‌లో ‘గేట్’ అని కూడా వ్యవహరిస్తారు.
GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు.
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి.
Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్‌గానే కాకుండా ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా…
Hero Ramcharan for Hero Company: హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రాంచరణ్‌తేజ్‌ని నియమించుకుంది. గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్ స్టైల్, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్‌కి హీరో రాంచరణ్ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇదిలాఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్ ఎక్స్‌టెక్ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్ సంతోషం వ్యక్తం చేశారు.
SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్‌ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం.