Demand For Heavy Vehicles: మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు ఈ ఏడాది 50 శాతం పెరిగే ఛాన్స్ ఉందని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ ఎండీ అండ్ సీఈఓ సత్యకం ఆర్య అన్నారు. ఈ వాహనాలకు గత కొద్ది నెలలుగా డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. జనవరి, ఆగస్టు మధ్య కాలంలో ట్రక్కులు, బస్సుల అమ్మకాల్లో వృద్ధి నెలకొందని పేర్కొన్నారు. అయితే 2018లో మాదిరిగా పీక్ లెవల్‌లో మాత్రం సేల్స్ జరగట్లేదని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవటం వల్ల హెవీ వెహికిల్స్‌కి మళ్లీ గిరాకీ వచ్చిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టిక్ టాక్.. డేటా లీక్
చైనీస్ షార్ట్-ఫామ్ వీడియో యాప్.. టిక్‌టాక్‌లో భారీఎత్తున డేలా ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 బిలియన్‌ల మందికి పైగా యూజర్ల సమాచారం చోరీ అయిందని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు. ఆన్‌లైన్ కేటుగాళ్లు సరైన సాంకేతిక భద్రతలేని సర్వర్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలు గల టిక్ టాక్ స్టోరేజ్‌లోకి ప్రవేశించి ఉంటారని ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లాగిన్ పాస్‌వర్డ్‌లను తక్షణం మార్చుకోవాలని సూచించారు.
Indian Youth Opting Gig jobs: ‘గిగ్’ జాబ్స్ వైపు.. భారతీయ యువత చూపు..
రూ.200 కోట్లకి హాస్పిటల్
బెంగళూరులోని శివ అండ్ శివ ఆర్థోపెడిక్, ట్రామా హాస్పిటల్‌ని 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనున్నట్లు నారాయణ హృదయాలయ ప్రకటించింది. ఈ మేరకు బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా ఆసుపత్రికి చెందిన అన్ని ఆస్తులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు, బాధ్యతలు తమ సొంతమవుతాయని రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. శివ అండ్ శివ ఆర్థోపెడిక్, ట్రామా హాస్పిటల్ గత ఆర్థిక సంవత్సరంలో 49 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు ఇవాళ 2వ రోజూ లాభాలతోనే ప్రారంభయ్యాయి. సెన్సెక్స్ 59262 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17667 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. డ్రీమ్‌ఫోక్స్, హెచ్‌ఏఎల్, రిలయెన్స్, టాటా మోటర్స్ స్టాక్స్ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు వాటిని పరిశీలించొచ్చు. పవర్‌గ్రిడ్, ఎయిర్‌టెల్, టైటాన్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. టీసీఎస్, విప్రో, రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్, టెక్ మహింద్రా, నెస్లే స్టాక్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.58 వద్ద కొనసాగుతోంది.