Telangana Tourism: పర్యాటకులకు శుభవార్త.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..
- పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త..
- క్రూయిజ్ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Tourism: నేటి సమాజంలో సమయాన్ని బిజీ బిజీగా గడిపేస్తున్నాం. కానీ వీకెండ్ మాత్రం కుటుంబ సభ్యులు, స్ర్నేహితులతో గడపాలని ప్లాన్ వేసుకుంటాం. ఆరోజు వారితో గడిపే క్షణాలు కోసం వారమంతా ఎదురుచూస్తాం. అయితే వారితో గడిపేందుకు హైదరాబాద్ లోని దగ్గరలో ఉండే ఏదైనా టూరిస్టు స్పాట్ లను వెతుకుతుంటాము. అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
Read also: Nandamuri Tarakaratna : తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో !
Also Read
తెలంగాణ టూరిజం రోడ్ కమ్ రివర్క్రూజ్ టూర్ (ROAD CUM RIVER CRUISE TOUR) పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ లింక్ ద్వారా వాటి వివరాలు సేకరించవచ్చని తెలిపింది. https://tourism.telangana.gov.in/blogpage?id=14 క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం రెండు రోజుల పాటు టూర్ నిర్వహిస్తారు. ప్రతి శని, ఆదివారల్లో ఈ టూర్ ను ఉంటుందని తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుండి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ , రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలు కూడా ప్రకటించారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వివరాలు ఇలా ఉన్నాయి..
* పెద్దలకు రూ.2,000, పిల్లలకు వన్-వే జర్నీకి రూ.1,600, పెద్దలకు రూ.3,000, పిల్లలకు రౌండ్ ట్రిప్ (పైకి క్రిందికి) రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.
* ప్రయాణికులకు భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్ శివకృష్ణ తెలిపారు.
* తొలిరోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌వో కార్యాలయం నుంచి శ్రీశైలానికి బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేయండి.
* అనంతరం శ్రీభామరాంబ మల్లిఖార్జున స్వామివారి దర్శనం ఉంటుంది. వీలైతే ఆ సాయంత్రం ఆనకట్ట సందర్శన ఉంటుంది. ఇక ఆ రాత్రి శ్రీశైలంలో బస చేయాల్సి ఉంటుంది.
* రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు ప్రయాణిస్తారు. కానీ ఇక్కడ ప్రయాణం శ్రీశైలం నుండి సోమశిల వరకు విహార యాత్ర (పడవ). సాయంత్రం వరకు అక్కడే ఎంజాయ్ చేస్తారు.
* సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. రాత్రి 9 గంటలకు భాగ్యనగరం చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
* ప్రయాణ వివరాలు, టిక్కెట్ బుకింగ్ సమాచారం కోసం https://tourism.telangana.gov.in/blogpage?id=14 లింక్ లేదా మొబైల్ నంబర్ 7731854994ను సంప్రదించాలని కోరారు.
CM Revanth: ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు సీఎం క్లారిటీ..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?