Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కార్తీక శని, ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో సామూహిక,గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది. కార్తీకమాసం రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన రద్దు చేయగా.. ఆశీర్వచన మండపంలో అందుబాటులో ఉండనుంది. సాధారణ రోజులలో సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కార్తీక మాసం రద్దీ రోజులలో 500 టికెట్ పొందిన భక్తులకు కూడా అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి లభించనుంది.
Read Also: Minister Lokesh: రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..