CM Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపణలు చేశారు.
Womens T20 Asia Cup : తాజాగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ టి20 ఏషియా కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ మెగా ఈవెంట్ జూలై 19న మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ జూలై 19న శ్రీలంకలోని డంబుల్లా స్టేడియంలో యూఏఈ – నేపాల్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇక అదే రోజు సాయంత్రం చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఇండియన్ ఉమెన్స్…
ప్రపంచ పొట్టి ప్రపంచకప్‌లో హోస్ట్ టీమ్ అమెరికా చరిత్రను సృష్టిస్తుంది. సొంతగడ్డపై ఎన్నో విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన యూఎస్ఏ టీమ్ సూపర్ 8కి చేరి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో వర్షం కారణంగా ఐర్లాండ్‌తో తమ ఆట రద్దు కావడంతో మోనాక్ పటేల్ జట్టు రెండో రౌండ్ కు చేరుకుంది. దీనితోపాటు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, అమెరికా 2026 టీ 20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే…
కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీని వల్ల శ్రీలంకతో భారత్ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
2024 ICC Women’s T20 World Cup: స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. మే 5 ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెమీ-ఫైనల్స్ లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. స్కాట్లాండ్ 2015 నుండి ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఐదవ ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) తమ లక్ష్యాన్ని సాధించింది. మరో సెమీ-ఫైనల్ లో శ్రీలంక కూడా UAEని…
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ – శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను కొద్దిసేపు బాగా నవ్వించారు. దీనికి కారణం శ్రీలంక ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే సమయంలో ఏకంగా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ ను నేలపాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also read: Nizamsagar: తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..! శ్రీలంక…
మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.
ICC: శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై విధించిన సస్పెన్షన్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్‌సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడానికి ICC ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు తక్షణమే శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. సస్సెన్షన్ నుంచి ఐసీసీ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఎల్‌సీ ఇకపై సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించదు’’ అని ప్రకటనలో పేర్కొంది.
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు.