LTTE Prabhakaran: ‘‘నా పేరు ద్వారకా ప్రభాకర్.. ఎల్టీటీఈ ప్రభాకరన్ కూతుర్ని’’.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమర్తెను అని చెప్పుకుంటున్న మహిళ వీడియో ‘‘ మవీరర్ నాల్’’ సందర్భంగా కనిపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ఎల్టీటీఈ కార్యకర్తలు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవంగా చేసుకుంటారు. తనను తానున ప్రభాకరన్ కుమార్తె, ద్వారకా ప్రభాకరన్‌గా మహిళ చెప్పుకుంది.
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
‘‘ ఎన్నో కష్టాలు, ద్రోహాలను అధిగమించి ఇక్కడికి వచ్చాను. ఏదో ఒక రోజు ఈలంని కూడా సందర్శించి ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను’’ అని మహిళ చెప్పడం వీడియో వినవచ్చు. శ్రీలంక సైన్యం చేతిలో ముల్లివైక్కల్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ 14 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన మృతదేహానికి డీఎన్ఏ పరీక్ష చేసి శ్రీలంక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Read Also: Honour killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. అబ్బాయితో డ్యాన్ చేసిందని అమ్మాయిని హతం చేసిన కుటుంబం..
ద్వారకా ప్రభాకరన్, శ్రీలంక తమిళ భాషలో 12 నిమిషాల నిడివి కలిగిన వీడియోలో మాట్లాడారు. ప్రత్యక్షంగా ఎల్టీటీఈని ఎదుర్కోలేక శ్రీలంక ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మద్దతు కోరిందని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం భిన్నత్వంలో ఏకత్వాన్ని నొక్కి చెబుతూ స్వేచ్ఛ కోసం ఎల్టీటీఈ పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు.
విదేశాల్లో ఉన్న లంకేయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, శ్రీలంకలో అట్టడుగున ఉన్న తమిళుల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ప్రత్యేక తమిళ ఈలం స్వయంప్రతిపత్తి, అభివృద్ధిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది జాతీయ నాయకుడి ఆలోచన అని మహిళ పేర్కొంది.
తమిళ పోరాటం సింహళ ప్రజలకు వ్యతిరేకం కాదని.. తమపై అణిచివేతకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. సింహళీయులు తమ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ద్వారకా ప్రభాకరన్ అని చెప్పుకునే వీడియోను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించాలని సూచించే సమాచారం తమకు అందిందని శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!