ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ – శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను కొద్దిసేపు బాగా నవ్వించారు. దీనికి కారణం శ్రీలంక ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే సమయంలో ఏకంగా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ ను నేలపాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Nizamsagar: తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..!
శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 121 వ ఓవర్ చివరి బాల్ కు శ్రీలంక ఆటగాడు ప్రభాత్ జైసూర్య కవర్స్ వైపు డ్రైవ్ చేయగా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్ లో ఉన్న ఫిల్టర్ చేతికి వెళ్ళింది. అయితే అక్కడే అసలైన సినిమా మొదలైంది. క్యాచ్ పట్టే సమయంలో మొదట తొలి స్లిప్ లో ఉన్న ఫిల్టర్ చేతిలో నుంచి బాల్ జారిపోగా.. దాన్ని జారీ విడిచే సమయంలో రెండవ స్లిప్పులో ఉన్న ఫీల్డర్ క్యాచ్ కోసం ప్రయత్నించి., అతడి చేతిలో నుంచి జారిపోయి విజయవంతంగా మూడో స్లిప్పులో ఉన్న ఫిల్టర్ కూడా పట్టేందుకు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ నేలపాలు చేసేసారు.
Also read: Mandali Buddha Prasad: నేడు జనసేన గూటికి టీడీపీ సీనియర్ నేత.. అవనిగడ్డ నుంచి బరిలోకి..!
ఇక ఇదే మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శ్రీలంక బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో బాల్ బ్యాట్ కు క్లియర్ గా తగిలినా కూడా ఎల్బీ కోసం రివ్యూ కోసం వెళ్లి సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యాడు. ఇక ప్రస్తుతం రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన మొదటి ఇనింగ్స్ లో భారీ స్కోరు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఆటగాళ్లు ఏకంగా 6 మంది అర్ధ సెంచరీలు సాధించడం విశేషం.
Dropped x 3🫥pic.twitter.com/PucY2gbLRV
— CricTracker (@Cricketracker) March 31, 2024
What just happened? 👀
.
.#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov— FanCode (@FanCode) March 30, 2024