2024 ICC Women’s T20 World Cup: స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. మే 5 ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెమీ-ఫైనల్స్ లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. స్కాట్లాండ్ 2015 నుండి ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఐదవ ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) తమ లక్ష్యాన్ని సాధించింది. మరో సెమీ-ఫైనల్ లో శ్రీలంక కూడా UAEని ఓడించి స్కాట్‌లాండ్ తో కలిసి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ రెండు జట్లు ఈ ఏడాది జరగబోయే ప్రపంచకప్ కు అర్హత సాధించాయి.
Also Read: Robot Dance: అరెరె.. ఈ రోబోలు బలే డాన్స్ చేసేతున్నాయిగా.. వీడియో వైరల్..
టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్ 3న బంగ్లాదేశ్ లో ప్రారంభం కానుంది. రెండు గ్రూపులుగా జరిగే ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. గ్రూప్-A లో శ్రీలంక, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-బి లో స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ లు పూర్తయిన తర్వాత, మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 17 , 18 తేదీల్లో జరిగే సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్ ల తర్వాత, ఫైనల్ అక్టోబర్ 29 న జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: Danush 50: ‘రాయన్’ దిగుతున్నాడు గెట్ రెడీ.. ఇట్స్ అఫీషియల్..
స్కాట్లాండ్, ఐర్లాండ్ మ్యాచ్ (మొదటి సెమీ-ఫైనల్) విషయానికొస్తే., ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని స్కాట్లాండ్ 16.2 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేథరీన్ బ్లైత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను (4-0-8-4, 35 నాటౌట్) ప్రదర్శించి స్కాట్‌లాండ్ ను విజయతీరాలకు చేర్చింది. సెమీ-ఫైనల్ రెండో మ్యాచ్ విషయానికొస్తే., ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మే 7న జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్, శ్రీలంక తమ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నాయి.
A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV
— Cricket Scotland (@CricketScotland) May 5, 2024