టీమిండియా హిట్ మ్యాన్ సాధించిన ఓ రికార్డు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు సాధించాడు. సాధారణంగా వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం 264 పరుగులు చేయడం మాములు…
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది.…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు అక్టోబర్ 31 మరపురాని రోజు అని చెప్పాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2005లో శ్రీలంకతో టీమిండియా ఏడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. అక్టోబర్ 31,2005 జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్…
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 35, అసలంక35, భానుక రాజపక్సే 33 రాణించారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్, కమిన్స్, జంపా రెండేసీ వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా గెలవాలంటే 155 పరుగులు చేయాల్సి ఉంది.
అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భధ్రత ఉంటుంది. 24 గంటలూ చెట్టు దగ్గర ముగ్గురి నుంచి ఐదుగురు పహారా కాస్తుంటారు. ఎవర్నీ ఆ చెట్టు దగ్గరకు అనుమతించరు. అంతేకాదు, వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వద్దకు వెళ్లాలన్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. ఇంత భద్రత మధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భద్రతను కల్పిస్తున్నారు. తెలసుకుందాం. అది బొధి చెట్టు.…
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్‌లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో…
శ్రీలంకలో ఆహారం కొరత, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యవసర ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లో 90శాతం మేర పెరిగి రూ.2657కి చేరింది. పాలు, సిమెంట్ సహా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంగా ఆ దేశంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విదేశీ మారక…
గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచాన్ని కరోనా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొన్ని దేశాలు కరోనా నుంచి బయటపడి తిరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా, కొన్ని దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అనేక దేశాల్లో కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు. పర్యాటకంపై ఆధారపడే దేశాల్లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇలా సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. శ్రీలంక పర్యాటకంపై ఆధారపడిన దేశం కావడంతో ఆ దేశం అన్ని రకాలుగా ఇబ్బందులు…
శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరనా మహమ్మారి కేసుల కారణంగా ఆదేశంలో చాలా కాలంపాటు లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడింది. అంతేకాదు, విదేశీమారక ద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీని నుంచి బయటపడేందుకు కీలకమైన దిగుమతులను నిలిపివేసింది. ఇక దేశంలో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశంలో వ్యాపారులు నిత్యవసర వస్తువులను అక్రమంగా స్టాక్ పెట్టుకోకూడదు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యవసర సరుకులు విక్రయించాలి. అక్రమంగా…
ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. కేసులు భారీ స్థాయిలో పెరగడానికి, తీవ్రత పెరగడానికి ఆ డెల్టా వేరియంట్ ప్రధాన కారణం. అమెరికాలో సైతం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇండియా పొరుగుదేశం శ్రీలంకలోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు అధికమవ్వడంతో ఆ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇంటివద్దనే ఉండాలని, సాద్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కోరింది. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగినట్టు…