శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరనా మహమ్మారి కేసుల కారణంగా ఆదేశంలో చాలా కాలంపాటు లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడింది. అంతేకాదు, విదేశీమారక ద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీని నుంచి బయటపడేందుకు కీలకమైన దిగుమతులను నిలిపివేసింది. ఇక దేశంలో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశంలో వ్యాపారులు నిత్యవసర వస్తువులను అక్రమంగా స్టాక్ పెట్టుకోకూడదు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యవసర సరుకులు విక్రయించాలి. అక్రమంగా స్టాక్‌ను నిల్వచేస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక, దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశంలో మరో 16 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించారు. ఇక శ్రీలంక రిజర్వ్ బ్యాంక్ పరిమితికి మించి నోట్లను ప్రింట్ చేయడంతో ద్రవ్యోల్భణం పెరిగిపోయింది. దీంతో వడ్డీ రేట్లను 6 శాతానికి పెంచాల్సి వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నది.