శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175★…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో…
శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా డబుల్ సెంచరీ ముంగిట ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇలా చేయడం సరికాదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని రోహిత్‌కు చెప్పినట్లు జడేజా స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. భారత్ 574…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన జడ్డూ.. ఏకంగా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా టెస్ట్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ మాత్రమే. ఈ క్రమంలో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 175…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్,…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అంచనాల మేరకు రాణించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 స్కోరు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు కోహ్లీ మీదే పడ్డాయి. అతడు సెంచరీ చేయక 833 రోజులు దాటిపోతోంది. ఈ మ్యాచ్‌లో అయినా తమ స్టార్ ఆటగాడు సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 45 పరుగులకే అవుటయ్యాడు. ఎంబుల్‌దెనియా బౌలింగ్‌లో…
పిల్లి, ఎలుక కొట్టుకుంటుంటే మన పెద్దలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను మనం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు అన్వయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. మరోవైపు నిత్యావసరాల…
ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా టీ20లలో టీమిండియా…