టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది. అయితే అనూహ్యంగా ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో బట్లర్ రెచ్చిపోయాడు. అతడికి కెప్టెన్ మోర్గాన్ (40) సహకారం అందించాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో హసరంగకు 3 వికెట్లు దక్కగా చమీర ఓ వికెట్ సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో బట్లర్‌కు ఇదే తొలి సెంచరీ కాగా.. ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా బట్లర్ సెంచరీనే మొదటిది కావడం విశేషం.
Read Also: టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే