స్వదేశంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై వరుసగా వన్డేలు, టీ20ల సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా విజయంతోనే ప్రారంభించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివరకు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 62 పరుగుల…
శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని…
గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు జట్టు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాయి. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ మ్యాన్ ఆఫ్…
శ్రీలంకలో చమురు సంక్షోభం నెలకొన్నది. దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. లంకలోని అనేక ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టపోయింది. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురును దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇటీవలే రెండు షిప్పుల్లో చమురు శ్రీలంకకు…
సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలపై సెలక్టర్లు వేటు వేశారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. అటు టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కాగా శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్ట్…
ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంక బోర్డు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. Read Also: కోహ్లీ వందో టెస్టుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ మార్గదర్శకాల…
అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం…
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తిరుమల శ్రీవారి సేవలో తరించారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీలంక ప్రధానికి టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మహింద రాజపక్సే కు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఏటా తిరుమలకు…
గాలె వేదికగా శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలజానో అరంగేట్రం చేశాడు. అయితే కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టులోనే సొలిజానోకు దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ ఆటగాడు సొలిజానో వికెట్లకు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొట్టిన బలమైన షాట్ సొలిజానో నుదుటిపై బలంగా తాకింది. Read Also: నా…