అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భధ్రత ఉంటుంది. 24 గంటలూ చెట్టు దగ్గర ముగ్గురి నుంచి ఐదుగురు పహారా కాస్తుంటారు. ఎవర్నీ ఆ చెట్టు దగ్గరకు అనుమతించరు. అంతేకాదు, వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వద్దకు వెళ్లాలన్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. ఇంత భద్రత మధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భద్రతను కల్పిస్తున్నారు. తెలసుకుందాం.
అది బొధి చెట్టు. బుద్దుడికి బొది వృక్షం కిందనే జ్ఞానోదయం అయింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బొదిచెట్టుకు సంబంధించిన చిన్న కొమ్మను క్రీస్తుపూర్వం 3 శతాబ్దంలో బొదిగయ నుంచి శ్రీలంకలోని అనురాధపురంలో నాటి సంరక్షించారు. అప్పటి నుంచి దాని నుంచి వచ్చిన చిన్న చిన్న కొమ్మలను నాటి ఆ ప్రాంతం మొత్తం విస్తరించేలా చేశారు. కాగా, సెప్టెంబర్ 21, 2012లో అనురాధపురం నుంచి బొదిచెట్టు కొమ్మను ఇండియాకు తీసుకొచ్చి చారిత్రాత్మకమైన సాంచిలోని సలామత్‌పూర్ కొండపై నాటారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలంక అద్యక్షుడు రాజపక్సే స్వయంగా నిర్వహించారు. ఆ తరువాత భారత ప్రభుత్వం ఈ చెట్టుకు వీవీఐపీ భద్రతను కల్పిస్తున్నది. ప్రతినెలా ఈ చెట్టు సంరక్షణ కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. భద్రత కోసం సంవత్సరానిక 13 నుంచి 15 లక్షల ఖర్చు చేస్తున్నారట. ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన నీటిని ఈ చెట్టుకు పోస్తారు. చిన్న మొక్కగా నాటగా నేటికి 15 అడుగుల చెట్టుగా ఎదిగింది. ఈ చెట్టును వ్యవసాయ శాస్త్రవేత్తలు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. చెట్టునుంచి అనవసరంగా ఒక్క ఆకు రాలినా భద్రతా సిబ్బంది గుండెలు గుభేలుమంటాయట. ఇక ఈ చెట్టును దర్శించుకోవడానికి నిత్యం అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఎవరు వచ్చినా దూరం నుంచి చూసి వెళ్లడమే తప్పించి చెట్టుకు ముట్టుకోవడానికి అకవాశం ఉండదు.
Read: రైల్వే కోచ్‌లలో పసుపు… తెలుపు గీతలకు అర్ధం ఏంటో తెలుసా…