ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఫైనల్స్‌లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది.
ఉత్కంఠభరిత పోరులో నంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ విజయం సాధించాడు. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా కార్ల్ సన్ అవతరించాడు. ఫైనల్లో భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అంబటి రాయుడు.. మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ లో బలమైన సారథిని నియమించాలని బంగ్లా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని ఎంపిక చేశారు.
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.