Chris Jordan: ఇదేం బ్యాటింగ్ రా సామీ.. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్ ప్రత్యర్థులకు ఊచకోత చూపించాడు. ఇంతకు ముందు క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేయని జోర్డన్.. సిక్సర్ల సునామీ చూపించాడు. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జోర్డాన్.. సిక్సర్ల మోత మోగించాడు. 32 బంతులు ఎదుర్కొన్న జోర్డన్ 7 సిక్సర్లు, 3 బౌండరీలు కొట్టి అజేయమైన 70 పరుగులు సాధించాడు. అంతేకాకుండా తన జట్టు భారీ స్కోర్ సాధించడానికి తోడ్పడ్డాడు.
Pakistan: పెరిగిన ఆహారం, ఇంధన ధరలు.. భారీ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాక్
Also Read
జోర్డన్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో జోర్డన్ మినహా ఎవ్వరూ ఆడలేకపోయారు. జోర్డన్‌తో పాటు ఫిన్ అలెన్ (21), కెప్టెన్ జేమ్స్ విన్స్ (18), డు ప్లూయ్ (18) పరుగులు చేశారు. అటు వెల్ష్ ఫైర్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, డేవిడ్ విల్లే, డేవిడ్ పెయిన్, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు.
TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..
అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెల్ష్‌ఫైర్.. 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు తడబడింది. 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో లూక్ వెల్స్ (24), స్టీఫెన్ ఎస్కీనాజీ (31), గ్లెన్ ఫిలిప్ (22), డేవిడ్ విల్లే (31) పరుగులు చేయగా.. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్ (2/41), టైమాల్ మిల్స్ (2/23), రెహాన్ అహ్మద్ (2/28) సత్తా చాటారు. ప్రస్తుత ఎడిషన్‌లో బ్రేవ్ ఈ గెలుపుతో బోణీ కొట్టింది.
Chris Jordan, take a bow 👊
A performance of 70 runs from just 32 balls, including 7 sixes 😲#TheHundred pic.twitter.com/Z2nqWBzaJF
— The Hundred (@thehundred) August 4, 2023
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!