గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో…
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెర్బియాకు చెందిన అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్పై 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడినప్పటికీ వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకుని జొకోవిచ్ టైటిల్ సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో నాలుగో సెట్ టై బ్రేక్కు దారి తీసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి కెరీర్లో మొదటి గ్రాండ్…
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఫీట్ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న కోర్టానే గేమ్స్లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా…
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్ను సమం చేసిన టీమ్ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…
ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం…
భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్లు పనిచేయాల్సి వచ్చింది. గత…