North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇతర మతాలను అచరించినా.. బైబిల్ పుస్తకాలన్ని కలిగి ఉన్నా, దక్షిణ కొరియా టీవీ కార్యక్రమాలు, సినిమాలు వీక్షించినా అక్కడ ప్రాణాలు పోవాల్సిందే. చివరకు తన మేనమామను కూడా వదిలిపెట్టలేదు కిమ్.
Kim Jong Un: ఉత్తర కొరయా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కూతురుతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ నార్త్ కొరియా అధినేతగా కిమ్ కూతరు ఉండబోతుందనే వార్తల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కిమ్ తన కూతురు ‘జూఏ’తో కలిసి క్షిపణి పరీక్షలు,
Fertility Rate:ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. 19 శతాబ్ధంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా, గత 50 ఏళ్లలోనే రెట్టింపు అయింది. 1975 తర్వాతే సగం జనాభా పెరిగారు. దాదాపుగా 140 కోట్ల జనాభాతో భారత్ ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’కు చేరుకుంది. ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటులో మాత్రం ఆఫ్రికా దేశాలు దూసుకుపోతున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు క్షీణించగా.. ఆఫ్రికా దేశాల్లో మాత్రం ఇది ఎక్కువగా…
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
North Korea: ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. కేవలం ఆ దేశం అణు ప్రయోగాలను మాత్రమే అక్కడి జాతీయ మీడియా ఛానెల్ చెబుతుంది. అయితే తాజాగా దక్షిణ కొరియా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనటకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రజలు ‘జీవించే హక్కు’ అక్కడి ప్రభుత్వం కాలరాస్తోంది.
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే కిమ్ జోంగ్ ఉన్. ఆయన చేసేదే చట్టం, చెప్పేదే న్యాయం కాదని ఎవరైనా ఎదురుతిరిగితే అక్కడిక్కడే మరణించడం ఖాయం. అంతగా ఆ దేశాన్ని గుప్పిట పెట్టుకున్నాడు. ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసినంతగా, ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. చివరకు తెలుసుకోవాలని ప్రయత్నించినా మరణం తప్పదు. హాలీవుడ్, దక్షిణ కొరియా సినిమాలు చూస్తే, ఇంటర్నెట్ వాడినా, దేశం దాటాలని ప్రయత్నించినా, కిమ్ జోంగ్ ఉన్ తాత, తండ్రులను…
అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల కంపెనీ శాంసంగ్ తన కస్టమర్ల కోసం కొత్తగా మొబైళ్లను అందుబాటులోకి తెచ్చింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ప్రభుత్వ వార్త సంస్థ కేసీఎన్ఏ సోమవారం ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించింది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాని కిమ్ తప్పుపట్టారు. ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.
Record-Low Weddings: ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది.. పెళ్లిని క్రమంగా వాయిదా వేస్తున్నారు నేటి యువతి.. ఉద్యోగం, సెటిల్మెంట్.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా,…