దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో
జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్‌డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి.
దక్షిణ కొరియాలోని అన్‌సియోంగ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోయింది. కూలిపోయిన దృశ్యాలు డాష్ క్యామ్ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్ సే రాన్ (24) మృతి చెందారు. ఆమె మరణం వార్త విన్న అభిమానులు, ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ద్రిగ్భాంతికి గురవుతున్నారు. కాగా.. ఈరోజు కిమ్ సే రాన్ తన ఇంట్లో శవమై కనిపించింది.
South Korea : దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుల విమానం మంటల్లో చిక్కుకుంది.
South Korea: దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు.