దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల కంపెనీ శాంసంగ్ తన కస్టమర్ల కోసం కొత్తగా మొబైళ్లను అందుబాటులోకి తెచ్చింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొత్త 5జీ ఫోన్లు గతంలోని మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ ను అందిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 40,999 గా కంపెనీ నిర్ణయించింది.
Also Read: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్‍ప్లే కలిగి ఉంది. ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ఇక, ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్‍ప్లే తో ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు అందించారు. ఈ మొబైల్స్ ను ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‍సైట్‍లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఫ్లిప్‍కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్‌లలో కూడా కొనుగోలు చేయొచ్చు.
Also Read:Dmitry Medvedev: పుతిన్‌ను విదేశాల్లో అరెస్టు చేయడం అంటే యుద్ధాన్ని ప్రకటించినట్లే..
అంతేకాదు, మొబైల్స్ కొనుగోలు మీద కంపెనీ బంఫర్ ఆఫర్ కూడా ప్రకటించింది. శాంసంగ్ వెబ్‍సైట్‍లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. Galaxy A54 5G, A34 5G కొనుగోళ్లు రూ. 1,299 విలువైన ఉచిత ట్రావెల్ అడాప్టర్‌ను కూడా అందిస్తోంది. సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్‍ను కేవలం రూ. 999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
Galaxy A54 5G 6.4-అంగుళాల 1080p సూపర్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. Galaxy A34 5G 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.6-అంగుళాల 1080p సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1తో ఉంది. రెండు ఫోన్‌లకు 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.
Also Read:BJP: ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు బీజేపీ కొత్త చీఫ్‌ల నియామకం
భారతదేశంలో Samsung Galaxy A54 ధర బేసిక్ 8GB/128GB మోడల్‌కు రూ. 38,999, 8GB/256GB వేరియంట్‌కు రూ. 40,999గా నిర్ణయించబడింది. Samsung Galaxy A54 5G లైమ్, గ్రాఫైట్, వైలెట్, తెలుపు రంగులలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్చి 27 వరకు ప్రీ-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.