ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు ఎంపికయ్యాడు. షమీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో టీమిండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. అతడి రాకతో భారత జట్టు బలం గణనీయంగా పెరిగిందన్నారు.
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్-గవాస్కర్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. రోహిత్ తన సతీమణి రితికా సజ్దే ప్రసవం నేపథ్యంలో ముంబైలోనే ఉన్నాడు. రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టీమిండియా కెప్టెన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు…
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడటమూ కష్టమేనని ప్రకటించిన 40 ఏళ్ల సాహా.. రంజీ ట్రోఫీ 2024 తనకు చివరిదని చెప్పాడు. తాజాగా సాహా వీడ్కోలు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతేడాదే రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నానని, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. గతేడాదే క్రికెట్‌ను ఆస్వాదించడం ఆపేశానని చెప్పుకొచ్చాడు. క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో…
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది.
Sourav Ganguly in Junior Doctors Protesting: కోల్‌కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (31)పై హత్యాచారం, హత్య ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యావత్ భారతావని కోరుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలవనున్నారని తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న…
Sreelekha Mitra On Sourav Ganguly: ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని దాదా డిమాండ్ చేశారు. అయితే ఈ ఒక్క ఘటనతో కోల్‌కతా, వెస్ట్ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదన్న దాదాపై…