నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కానున్నాయి. టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే రెండు టీమ్స్ ముమ్మర సాధన చేస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రత్యేక బంగారు నాణెంను తయారు చేయించింది. ప్రత్యేక నాణెం…
టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో అద్భుతంగా ఆడిందని కొనియాడారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని, తీవ్ర ఒత్తిడిలో కూడా తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేసిందన్నారు. రిచాకు 22 ఏళ్లే అని, ఎంతో భవిష్యత్ ఉందన్నారు. రిచా.. ఏదో ఓరోజు భారత కెప్టెన్ కావాలని తాను ఆశిస్తున్నట్లు గంగూలీ చెప్పారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత…
భారత క్రికెట్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్‌లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లీ: భారత టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీ విషయానికి…
ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)కు ముందు ఖాళీగా ఉన్న బోర్డు పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీసీసీఐ అనుభవజ్ఞులైన నిర్వాహకులు, కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం, పేర్లు పరిశీలించబడిన వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన మాజీ…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో…
భారత జట్టు మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ టీమిండియాలో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడా? అంటే.. అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజాగా పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా భజ్జీని పంజాబ్ నామినేట్ చేసింది. ఈ నెల చివరలో జరిగే ఏజీఎంకు పంజాబ్ తరఫున అతడు హాజరవుతాడు. సెప్టెంబర్…
BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో…
భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. గంగూలీ ఈ ఇన్నింగ్స్‌ను భారత్ లో కాదు విదేశాలలో ప్రారంభిస్తాడు. దాదా ఓ విదేశీ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. SA20 లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కోచ్‌గా గంగూలీ నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. గంగూలీ ఒక జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో ఆయన చాలా…
భారత జట్టు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ అక్టోబర్‌లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెరీర్‌లోని చివరి వన్డే సిరీస్ ఆడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ బాగా రాణిస్తే ఈ ఫార్మాట్లో ఆడటం కొనసాగించాలని ఆయన తెలిపారు. Also Read:Air India: కొత్త సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల…
Sourav Ganguly to Contest for CAB President Again: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి భారత క్రికెట్ బోర్డులో తన ప్రభావం చూపడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి దాదా పోటీ చేస్తున్నారని సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష పదవికి గంగూలీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబ్ ఎన్నికల్లో…