Cricket Stars : స్టార్ క్రికెటర్లు.. క్రికెట్ కు గుడ్ బై.. సినిమాలకు సై..సై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేవిడ్ వార్నర్ పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. కేవలం క్రికెట్‌తోనే ఆకట్టుకోలేదు. తెలుగు సినిమాల్లోని ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దీంతో సినిమాల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. రీసెంట్లీ ఈ న్యూసులే నిజమయ్యాయి. నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ లీక్ చేసేశారు. దీంతో సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది.
Also Read : Samantha : టాలీవుడ్ కంబ్యాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Also Read
డేవిడ్ వార్నర్‌లా ఇప్పుడు మరో స్టార్ ఇండియన్ క్రికెటర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు మరెవ్వరో కాదు.. క్రికెట్ రంగానికి అసలు సిసలైన వన్నె తెచ్చిన స్పోర్ట్ మ్యాన్ గంగూలీ. ఖాకీ2లో అతిధి పాత్ర చేయబోతున్నాడని టాక్ వస్తుంది. ఖాకీ ది బెంగాల్ చాప్టర్ వెబ్ సిరీస్ లో గంగూలీ ఉన్నారని నిర్మాత నీరజ్ పాండేను అడిగితే తినబోతూ రుచి ఎందుకు అడుగుతున్నారంటూ దాటవేశాడు. మార్చి 20న ఖాకీ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా రంగంలోకి క్రికెటర్లు రావడం ఇప్పుడు కొత్తకాదు. కొన్నేళ్ళ నుండి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, అనిల్ కాంబ్లీ, వినోద్ కాంబ్లీ, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, బ్రెట్ లీ ఇలా స్టార్ క్రికెటర్లు.. ఎప్పుడో ఏదో ఒక టైంలో మేకప్ వేసుకున్నవాళ్లే. కొంత మంది గెస్ట్ అప్పీరియన్సులకే పరిమితమైతే మరికొంత మంది క్రికెటర్లు ఫుల్ లెంత్ రోల్లో మెస్మరైజ్ చేశారు. మూవీకి వీళ్లు ఎంత వరకు హెల్ప్ అయ్యారనేది పక్కన పెడితే క్రికెటర్లకు ఉండే క్రేజ్ యూజ్ చేసుకోవాలని ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి తెస్తున్నారు దర్శక నిర్మాతలు.
తాజావార్తలు
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!