Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- పెర్త్ వేదికగా మొదటి టెస్టు
- కోహ్లీకి మద్దతుగా దాదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డారు.
ఓ క్రీడా ఛానల్‌తో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఒక ఛాంపియన్ ఆటగాడు. అతని వన్డే గణాంకాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి. గతంలో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో మంచి విజయాలు సాధించాడు. 2014లో నాలుగు సెంచరీలు చేశాడు. 2018లో ఒక సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాలో అతని రికార్డులు బాగున్నాయి. ఆస్ట్రేలియాలో 6 టెస్టు సెంచరీలు చేశాడు. ఇది మాములు విషయం కాదు. 28, 29, 30 సంవత్సరాల వయస్సులో గేమ్ భిన్నంగా ఉంటుంది. 36, 37 సంవత్సరాల వయస్సులో మరోలా ఉంటుంది. ఆసీస్ గడ్డపై ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు’ అని చెప్పారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Also Read: Vivo Y18t Price: ముందస్తు సమాచారం లేకుండా.. 10 వేలలో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన ‘వివో’!
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విరాట్ కోహ్లీ సీరియస్‌గా తీసుకుంటాడు. విరాట్ రాణిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాలో వికెట్ వేగంగా ఉంటుంది. పిచ్‌పై పేస్, బౌన్స్ ఉంటుంది. కూకబుర్రా బంతితో సీమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అతనికి మంచి సిరీస్ అవుతుంది. టెస్టు క్రికెట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం కెరీర్‌లో ఇదే చివరిసారని అతడికి తెలుసు. కాబట్టి ఈ సిరీస్ కోహ్లీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం అవుతుంది’ అని దాదా చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 24 టెస్ట్ మ్యాచ్‌ల్లో 42 ఇన్నింగ్స్‌లలో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!