తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ…
నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక…
కొంతకాలం నుంచి భారత చిత్రసీమలో సౌత్ vs నార్త్ పోరు జరుగుతోన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే స్టార్స్‌కి ఆ విషయమై తరచు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నటుడు సోనూసూద్‌కి కూడా సౌత్ vs నార్త్ అంశంపై ప్రశ్నలు ఎదురవ్వగా, తాజాగా అతడు స్పందించాడు. ‘‘హిందీ చిత్రాల్ని కాదనుకొని, దక్షిణాది సినిమాల్ని అంగీకరించడంపై నాకు తరచూ ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే.. నేను ఏం చేస్తున్నానన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏ భాషలో సినిమాలు చేసినా,…
కరోనా సమయంలో నటుడు సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో పేదలకు సహాయం అందించి రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి తాజాగా రూ.68 వేలు దోచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) అనే మహిళ బంధువుల్లో ఒకరికి కేన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమైంది. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో…
కరోనా లాక్‌డౌన్ హీరో సోనూసూద్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంకుర హాస్పిటల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ వ్యవహరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా తమ 12వ ఆస్పత్రిని అంకుర హాస్పిటల్స్ సంస్థ ప్రారంభించనుంది. ఈ ఏడాదిలోనే మరో నాలుగు ఆస్పత్రులను అంకుర సంస్థ ప్రారంభించనుంది. ఈ మేరకు తమ హాస్పిటల్స్ విస్తరణపై అంకుర యాజమాన్యం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సోనూసూద్, అంకుర ఎండీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ…
భారతదేశం74 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తోంది. రోజురోజుకూ ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒకటిగా మనదేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో దయనీయ, కౄర పరిస్థితులు చవి చూశారు మన పూర్వికులు. బ్రిటీష్ పాలన నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది రియల్ హీరోలు ప్రాణాలు అర్పించారు. భారతదేశం బ్రిటీష్ వారిపై ఎన్నో సంవత్సరాల…
ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు.…
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్‌పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. మోగా నియోజకవర్గంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. దీంతో పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నటుడు సోనూసూద్‌పై ఈసీ ఆంక్షలు విధించింది. ఆయన సోదరి పోటీ చేస్తున్న మోగాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా నిషేధించింది. సోనూసూద్ కారును కూడా స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎన్నికల అధికారులు సోనూసూద్‌ను ఇంటికి తరలించారు.…
సోనూ సూద్ ఈ పేరు వింటే భారతీయులు ఒళ్లు పులకరిస్తుంది. తమ కోసం ఒకరు ఉన్నారన్న భరోసా కలుగుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించారు సోనూసూద్. ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి చూపించడం ద్వారా పేదల పాలిట దేవుడు అయ్యరు సోనుసూద్. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా తన పేరు మార్మోగుతుంది. మరోవైపు సోనుసూద్ ఇప్పటికి…
సినీ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎంతో మంది ఈ హెల్పింగ్ స్టార్‌కు ఆరాధ్యులుగా మారారు. కొన్ని చోట్లయితే ఏకంగా గుడులు సైతం కట్టారు. తాజాగా సోనూసూద్ పంజాబ్ స్టేట్ ఐకాన్ హోదా నుంచి స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. Read…