భారతదేశం74 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తోంది. రోజురోజుకూ ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒకటిగా మనదేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో దయనీయ, కౄర పరిస్థితులు చవి చూశారు మన పూర్వికులు. బ్రిటీష్ పాలన నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది రియల్ హీరోలు ప్రాణాలు అర్పించారు. భారతదేశం బ్రిటీష్ వారిపై ఎన్నో సంవత్సరాల తిరుగుబాట్లు, పోరాటాలు చేసిన తరువాత 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. దేశం కోసం ధైర్యంగా పోరాడి అమరవీరులైన రియల్ హీరోలలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు కూడా ఉన్నారు. అందులో భగత్ సింగ్ 1931 మార్చి 23న 20వ ఏటనే వీరమరణం పొందడం బాధాకరం.
Read Also : Boycott RRR in Karnataka : అవమానం అంటూ కన్నడిగుల ఆగ్రహం… మేకర్స్ కు షాక్
భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును బ్రిటిష్ పాలకులు ఉరి తీసి నేటితో 91 సంవత్సరాలు గడిచాయి. ఈ రియల్ హీరోలు వీరమరణం పొందినప్పటికీ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇక నేడు లెజెండ్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయనను తలచుకుంటూ నెటిజన్లు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2002లో వచ్చిన “షహీద్-ఈ-ఆజం” అనే చిత్రంలోని ఫోటోలను పంచుకుంటూ సోనూసూద్ భగత్ సింగ్ ను స్మరించుకున్నారు. ఈ చిత్రంలో షాహీద్ భగత్ సింగ్ పాత్రలో సోనూసూద్ కన్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనం సృష్టించలేకపోయినప్పటికీ, సోనూ నటనకు మంచి స్పందన లభించింది. ఇక సోనూసూద్ తో పాటు ఆయన పాత్రలో నటించిన అమోల్ పరాశర్, బాబీ డియోల్, సిద్ధార్థ్, అజయ్ దేవగన్ కూడా భగత్ సింగ్ ను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులు చేశారు.
Remembering the legend Shaheed Bhagat Singh on his death anniversary today.
— sonu sood (@SonuSood) March 23, 2022
Was an honor for me to portray him on the big screen, which marked my debut with Shaheed-E-Azam. The firsts are always the most special ones and they leave a forever mark in your life.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mQI85FHkAa