పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్ స్పైవేర్ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు…
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై…
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని…
పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్,…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోనియా గాంధీ ఆయనకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. వీహెచ్ త్వరగా కోలుకోవాలని, మీ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని సోనియా పలకరించినట్లు తెలుస్తోంది. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపినట్లు…
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు.…
తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీని నియమించాల్సి ఉన్నా, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని వాయిదా వేశారు. కాగా, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నియామకంపై సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరయ్యారు. ఏ క్షణమైనా టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నది. టీపీసీసీ రేస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి…