రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు.
Read: ఉపాసన సోదరి నిశ్చితార్థం!
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఈ గ్రూపులు ప్రతిరోజూ సమావేశమవుతాయని, పార్లమెంట్‌లో ప్రస్తావించే సమస్యలకు సంబందించి అవసరమైనపుడు ఇంటర్ సెషన్ పీరియడ్స్‌లో కూడా సమావేశం కావోచ్చని సోనియాగాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేతను మారుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పక్షనేతగా బెంగాల్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరినే కొనసాగుతారని స్పష్టం చేశారు. శశిథరూర్, గౌరవ్ గొగోయ్, కే సురేష్, రవనీత్ సింగ్ బిట్టు, మాణిక్యం ఠాగూర్‌లకు ఈ గ్రూపులో స్థానం కల్పించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటరీ గ్రూపులు సమావేశాలు నిర్వహిస్తాయి. అవసరమైనపుడు ఈ గ్రూపులు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నది. ఉమ్మడి సమావేశం నిర్వహించినపుడు మల్లిఖార్జున ఖర్గే కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.