దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ధరల పెరుగుదల, కరోనా అదుపు, పెగాసస్ వంటి స్పైవేర్‌లను వినియోగించి కీలక వ్యక్తులపై నిఘా ఉంచడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు శివసేన ప్రకటించింది.
Read: భూమికి బెన్ను ముప్పు…2300 నాటికి…