దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆదర్శ నేత అని, దేశం ప్రపంచంతో పోటీ పడటంలో రాజీవ్ గాంధీ పునాదులు వేశారంటూ.. ఆయన వ్యాక్యానించారు. 18 ఎండ్లకే ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ది అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీనే…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్థంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీరభూమిలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. వీరితో పాటు నేతలు పి.చిదంబరం, సచిన్ పైలట్ కూడా మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే.. రాజీవ్ గాంధీ వర్థంతి నేపథ్యంలో ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మా నాన్న దూరదృష్టి గల నాయకుడు.. ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. అతను కరుణ…
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలలోకి తట్టాబుట్టా సర్దేశారు. ఎట్టకేలకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిలుపు అందింది. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత…
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కిరణ్ కుమార్ రెడ్డి. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయన్ను ఏపీ పీసీసీ చీఫ్ గా…
వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్.. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీని కోసం కాంగ్రెస్ అధిష్టానం.. 3 రోజుల పాటు ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్-2022’ పేరిట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మేధోమథన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు ఈ నెల 13న ప్రారంభం కాగా.. నేడు ముగిసింది. అయితే.. ఈ “నవ సంకల్ప్ శిబిర్” సదస్సులో పలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. అవి.. ఒక కుటుంబానికి ఒక టిక్కెట్. 50…
కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్…
కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కీలక నేతలు ఉదయ్ పూర్ తరలివెళ్లారు. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్…
ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీలో ప్రారంభోపన్యాసం చేసిన ఆమె.. చాలా స్పష్టంగా నాయకులకు ఇలా దిశానిర్దేశం చేశారు. మనలో ప్రతిఒక్కరి జీవితాలకు పార్టీయే ప్రధాన కేంద్ర బిందువు, ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంగా, క్రమశిక్షణతో, నిలకడగా, సమిష్టి బాధ్యత అనే స్పృహతో దృఢతరమైన పట్టుదల, దీక్షను ప్రదర్శించాలే తప్ప, ఇతరత్రా వేరే మంత్ర దండాలు ఏమీ లేవని స్పష్టం చేశారు…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. పలు అంశాలను కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత వుంది. చెప్పిన మాటకు కట్టుబడి వుంటాం. రాష్ట్ర విభజనపై అవగాహన లేనివారు ఏదో ఒకటి మాట్లాడుతారు. 2009 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర విభజన చేయలేదు. వంక పెట్టారని వచ్చే ఆరోపణల్ని ఖండిస్తున్నా. బిల్లు పెట్టి పాస్ కాకుంటే మొదటికే మోసం వస్తుందని,…