కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిశారు.
మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు టెన్ జన్ పథ్ లోని సోనియా గాందీ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలతో మునుగోడు ఉప ఎన్నికలపై ప్రియాంక గాంధీ సమీక్షించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికతోపాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నాయకుల మధ్య విభేదాలపై చర్చించే అవకాశం వుందని తెలిస్తోంది. ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్లపై సీనియర్ నాయకుల విమర్శలపై…
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు.
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ఇవాళ భేటీ కాబోతోంది. సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. పార్టీ అధినేత్రి సోనియా కోవిడ్ నుంచి కోలుకోగానే సీడబ్ల్యూసీనీ ఏర్పాటు చేసింది.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో…
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రకటనలో కేంద్రంపై సోనియా తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రంలోని నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.