కాంగ్రెస్ పార్టీ త్వరలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ అధ్యక్షతన ఆగస్టు 28న మధ్యహ్నం 3.30 గంటలకు వర్చువల్ గా సమావేశం జరగనుంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మెజారిటీ నేతలు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.
అయితే.. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4న రాంలీలా మైదాన్ లో ధరల పెరుగుదల పై భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ లోగానే ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ సభ్యుల తీర్మానాల ద్వారా అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసే అవకాశం వుందని తెలుస్తుంది. తీర్మానాల ద్వారా పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ లు, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసే అవకాశం వుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర లో 500 మంది పాల్గొననున్నారు.
పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. తెలంగాణ నుండి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కి చోటు దక్కింది. సెప్టెంబర్ 5న కశ్మీర్ కి చేరుకోవాలని ఆదేశించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో వెంకట్ అక్కడు వెళ్లేందు సిద్దమయ్యారు. రెండు రోజుల శిక్షణ తర్వాత పాదయాత్ర మొదలుకానుంది. ఈ యాత్రకు డ్రస్ కోడ్ ను కూడా ఖరారు చేశారు. వైట్ కుర్తా, పైజామాతో యాత్రలో పాల్గొనాలని పార్టీ నిర్ణయించింది.
MLA RajaSingh on Suspension: పార్టీ నన్ను వదులుకోదు..! బండి సంజయ్ పై నమ్మకం వుంది..