Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక "మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు.
Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి…
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేసిన కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ నేతృత్వంలో పలు కీలక హోదాల్లో పని చేసిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించారు. మరో వైపు తాను బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు.
Congress leader Ghulam Nabi Azad resigns Congress Party: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీ తీరుపై గత కొంత కాలంగా ఆజాద్ అసంతృప్తిగా ఉంటున్నారు. ఇటీవల కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.